హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్,కేటీఆర్‌ పాత్ర ఏం లేదు – ఏపీ మంత్రి

-

హైదరాబాద్ అభివృద్ధిలో సీఎం కేసీఆర్,కేటీఆర్‌ పాత్ర ఏమీ లేదని.. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ ఇచ్చిన వార్షిక నివేదికలో ఏపీది 3వ స్థానంలో ఉందని… ఈ విషయం మీకు తెలుసా కేటీఆర్‌ ? అని ప్రశ్నించారు. ఎవరో ఫ్రెండ్ చెబితే ఏపీని తక్కువ చేసి మాట్లాడతారా? హైదరాబాద్ లేని తెలంగాణను మీరు ఓ సారి ఊహించుకోండని సవాల్‌ విసిరారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచిని చూసి తెలంగాణలో కూడా చేద్ధామని కేసీఆర్‌ కూడా చెప్పారు, ఈ విషయం మీకు గుర్తులేదా కేటీఆర్‌? అని నిలదీశారు సీదిరి అప్పలరాజు.

మీ తెలంగాణలో విద్యుత్ కోతలు లేవా కేటీఆర్‌? మొన్నటికి మొన్న విద్యుత్ కోతలపై రైతులు ధర్నా చేయలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమం స్పూర్తితోనే తెలంగాణలో అమలు చేస్తున్నారనిపేర్కొన్నారు. ఏపీ మాదిరిగానే ఇంగ్లీష్ మీడియం తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. ఈ విషయం మీకు తెలియలేదా కేటీఆర్‌? అని ప్రశ్నించారు సీదిరి అప్పలరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version