టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకి స్వీకరించిన సుప్రీంకోర్టు ఈరోజు మళ్లీ విచారణ చేపట్టింది.
ఏపీ సిఐడి తరఫున ముకుల్ రోహత్ కి తన వాదనలు ధర్మాసనానికి వివరించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం విచారణని మూడు వారాలకు వాయిదా వేసింది.