ఏపీలో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మిపై కేసు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎందుకంటే.. సోమవారం ఉదయం ఆమె గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సమక్షంలోనే కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తిని చెప్పుతో కొట్టింది.
అంతేకాకుండా, సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో అనంత లక్ష్మిపై సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, అనంతలక్ష్మి దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మిపై కేసు నమోదు
గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సమక్షంలోనే కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టిన అనంత లక్ష్మి.
సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని బెదిరింపులు. అనంత లక్ష్మిపై సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసిన పోలీసులు. pic.twitter.com/21aJqgtkEP— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025