వైసీపీ నేత వ్యాపార వేత్త పొట్లూరి వర ప్రసాద్ ను హైదరబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్లలో కేసులు నమోదైనందున ఆయనని నేడు మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పీవీపీ బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 14 లో తాజాగా ప్రేమ్ పర్వత్ విల్లస్ పేరిట నిర్మాణాలు చేపట్టారు, కాగా ఆ వీళ్ళల్లో ఒక దానిని విక్రమ్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం కొనుగోలు చేశాడు. ఆ విల్లలను అధునాతన స్థాయి లో ఆధునికరించేందుకు విక్రమ్ పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పీవీపీ ఆ ప్రాంతానికి కొందరు అనుచరులతో చెరీ అక్కడి పనులను అడ్డుకున్నాడు విల్లా ఎలా ఉందో అలాగే ఉండాలని ఆధునికరించొద్దని బెదిరించాడు. విషయం తెలుసుకున్న విక్రమ్ అక్కడికి చేరగా ఇద్దరి నడుమ వాగ్వాదం ఏర్పడింది దాంతో పీవీపీ విక్రమ్ ఇంటి లోనికి చెరీ ఫర్నిచర్ ను ధ్వసమ్ చేశాడు. దాంతో విక్రమ్ బంజారాహిల్ల్స్ లోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనకు పీవీపీ నుండి ప్రాణహాని ఉందని పీవీపీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని ఆయన కేసు ఫైల్ చేశాడు. పోలీసులు పీవీపీ పై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. పీవీపీ పై ఐపీసీ సెక్షన్లు 447, 427, 506 కింద కేసు నమోదు అవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పీవీపీ గూండాయిజం..! అరెస్ట్ చేసిన పోలీసులు..!
-