తమిళ స్టార్ హీరో, TVK పార్టీ అధినేత విజయ్ దళపతి కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. తొలిసారిగా అతనిపై కేసు నమోదు అయింది. మధురై లో ఇటీవల విజయ్ కి సంబంధించిన పార్టీ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ పార్టీ కార్యక్రమంలో విజయ్ అభిమాని.. ఆయనను కలిసేందుకు దగ్గరకు వెళ్ళాడు. ఈ తరుణంలో విజయ్ బౌన్సర్లు శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేశారని… తెలుస్తోంది. ఇందులో భాగంగానే శరత్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు కూడా చేశారట. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీ అధినేత విజయ్ పై కేసు నమోదు అయినట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.