వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. కామారెడ్డి జిల్లా వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కామారెడ్డి జిల్లా వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుండి తిమ్మారెడ్డి వెళ్లే రహదారిలో కళ్యాణి ప్రాజెక్ట్ బ్రిడ్జ్ పొంగిపొర్లడం తో నిలిచిపోయాయి రాకపోకలు.

కాగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కామారెడ్డి, మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
బ్రేకింగ్ న్యూస్
వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు
భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుండి తిమ్మారెడ్డి వెళ్లే రహదారిలో కళ్యాణి ప్రాజెక్ట్ బ్రిడ్జ్ పొంగిపొర్లడం తో నిలిచిన రాకపోకలు pic.twitter.com/SUJTHxel25
— Telugu Feed (@Telugufeedsite) August 27, 2025