అభస్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెట్టొచ్చు : హైకోర్టు

-

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్స్ అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, వారి కుటుంబసభ్యులు, మహిళా కేడర్‌పై అసభ్యకరపోస్టులు చేయడంతో వారికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ఫిర్యాదులను తిరగదోడి కామెంట్స్ పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడుతున్నారని విజయ్ బాబు హైకోర్టులో పిల్ వేయగా దీనిని విచారించిన ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెట్టడం సమంజసమే అని కోర్టు సైతం అభిప్రాయపడింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది.కేసులపై ఏమైనా అభ్యంతరాలుంటే నేరుగా కోర్టును సంప్రదించాలని తీర్పులో పేర్కొంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news