సరియైన క్రెడిట్ కార్డు ఉంటే మంచిగా ఆఫర్స్ ని పొందొచ్చు. మరి క్రెడిట్ కార్డు, ఆఫర్లు గురించి చూద్దాం. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు షాపింగ్‌పై 5 శాతం వరకు క్యాష్ బ్యాకును పొందొచ్చు. ప్రైమ్ మెంబర్లు కాని వారికి 3 శాతం క్యాష్ బ్యాకును అందిస్తోంది. 100కి పైగా అమెజాన్ పార్టనర్ మర్చెంట్లకు 2 శాతం క్యాష్ బ్యాకు, ఇతర లావాదేవీలపై 1 శాతం క్యాష్ బ్యాకును ఇస్తోంది.
అలానే యాక్సిస్ బ్యాంకు ఏస్ క్రెడిట్ కార్డు అయితే గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ షాపింగ్‌పై 5 శాతం క్యాష్ బ్యాకును ఇస్తోంది. స్విగ్గీ, జొమాటో, ఓలాలపై 4 శాతం క్యాష్ బ్యాకును, ఇతర కొనుగోళ్లపై 2 శాతం ఫ్లాట్ క్యాష్ బ్యాకును ఇస్తోంది. అలానే గూగుల్ పే రీఛార్జ్‌లు, ఇతర పేమెంట్లపై 5 శాతం క్యాష్ బ్యాకును కూడా పొందవచ్చు. ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు తీసుకున్న వెంటనే రూ.500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డు లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అయితే ఫ్లిప్‌కార్ట్, మింత్రాలపై షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాకును ఈ కార్డు ద్వారా పొందవచ్చు. క్లియర్‌ట్రిప్, క్యూర్.ఫిట్, పీవీఆర్, స్విగ్గీ, ఉబర్ వంటి వాటిపై 4 శాతం క్యాష్ బ్యాకు, అన్ని కేటగిరీలపై 1.5 శాతం క్యాష్ బ్యాకును పొందొచ్చు.
అదే హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డు అయితే అమెజాన్, ఫ్లిప్ కార్టు షాపింగ్‌పై ఈ క్రెడిట్ కార్డు 5 శాతం క్యాష్ బ్యాకును తీసుకోచ్చు. పేజాప్, స్మార్ట్ బై వంటి వాటిపై ఫ్లయిట్, హోటల్ బుకింగ్స్ చేపడితే 5 శాతం క్యాష్ బ్యాకును, ఆఫ్ లైన్ కొనుగోళ్లపై 1 శాతం క్యాష్ బ్యాకును ఆఫర్ చేస్తోంది.