విశాఖ జిల్లాలో దారుణం.. దళిత యువతిపై కుల వివక్ష

-

విశాఖ: ఉమ్మ వరం గ్రామంలో దారుణం జరిగింది. ఓ దళిత యువతి పట్ల సర్పంచ్ సంజీవ్ కులవివక్ష చూపారు. వాలంటీర్ దళిత యువతిను సర్పంచ్ దూషించారు. ఊరిలో తన ముందు తిరగకూడదని, కనపడకూడదని హుకుం జారీ చేశారు. సర్పంచ్ ఆదేశాలతో దళిత యువతి నీరు కోసం కూడా వేరే బావి దగ్గరకు వెళ్లాలేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో ఆ కుటుంబాన్ని ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ యువతి వాలంటిర్ ఎస్‌సీ వర్గంలో పుట్టడం తప్పా అని వ్యాఖ్యానించారు. వైసీపీ సర్పంచ్ కులం పేరుతో దూషించిన పరిస్థితి వచ్చిందని, సీఎం జగన్ ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు యువతి ఫిర్యాదు చేస్తే ఇంటికి వెళ్లి మరీ బెదరిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

కులవివక్షకు గురైన యువతి వలంటీర్ మాట్లాడుతూ ‘‘మా కుటుంబ సభ్యులు బయట బట్టలు ఉతికి తే మముల్ని సర్పంచ్, ఉప సర్పంచ్ కులం పేరుతో దూషించారు. ఓ అగ్ర కులానికి చెందిన వాలంటీర్ సాయి అనే వ్యక్తి తో నా ఫోన్ తీసుకొని డేటా తీసుకున్నారు. దళిత వర్గంలో మేము పుట్టడం నేరమా?. ఆధునిక కాలంలో ఇంకా కులవివక్ష జరగడం చాలా బాధాకరం’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version