16 లింకు రోడ్డులు పూర్తి అయ్యాయని.. వీటితో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని.. నగర అభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యమన్నారు. దశలవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామని… కేటీఆర్ అన్నారు. ఈ రోజు 5 లింకు రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే 16 లింకు రోడ్లను పూర్తి చేశామని, త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.