హుజూరాబాద్ వార్‌లో క్యాస్ట్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న కులలని మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలు బాగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇతర పార్టీల గురించి పక్కనబెడితే… ప్రధానంగా టిఆర్ఎస్-బిజేపిల మధ్య వార్ జరుగుతుందని క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. కాంగ్రెస్ ఉన్నా సరే పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.
కాకపోతే ఇక్కడ పార్టీల మధ్య పోరు జరుగుతుందని అనడం కంటే….వ్యక్తుల మధ్య వార్ జరుగుతుందని చెప్పొచ్చు. సిఎం కేసిఆర్-ఈటల రాజేందర్ల మధ్య అసలైన యుద్ధం జరుగుతుంది. అధికారానికి-ఆత్మగౌరవానికి మధ్య పోరు జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ పోరులో పైచేయి సాధించాలని ఇటు కేసిఆర్, అటు ఈటల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో క్యాస్ట్ పాలిటిక్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్‌లో బిసి, దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తం హుజూరాబాద్‌లో రెండు లక్షల 36 వేలపైనే ఓట్లు ఉన్నాయి. అందులో బీసీలు ఓట్లు లక్షా 32 వేల వరకు ఉన్నాయి. అటు దళితుల ఓట్లు 48 వేల వరకు ఉన్నాయి. ఇక రెడ్ల ఓట్లు కూడా 20 వేల పైనే ఉన్నాయి. ప్రధానంగా చూస్తే బిసి, దళితుల ఓట్లే కీలకం. ఇప్పటికే కేసిఆర్ దళిత బంధు ద్వారా దళితులని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే బిసిలకు కూడా కులాల వారీగా పథకాలు, పనులు చేసి పెడుతున్నారు.
అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ పనులు చేయగలిగారు. అటు అభ్యర్ధిని కూడా బిసి కులానికి చెందిన వ్యక్తి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని పెట్టారు. అయితే ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అంతా కేవలం ఈటలని దెబ్బకొట్టడానికే చేస్తున్నారు. కాకపోతే బిసి వర్గానికి చెందిన ఈటలకు… ఇక్కడ బిసిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అటు దళితులు కూడా ఈటలకు సపోర్ట్‌గానే ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈటల భార్య జమున రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి… దీంతో రెడ్డి వర్గం మద్ధతు కూడా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లైతే టిఆర్ఎస్ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తే… అది ఈటలకే ప్లస్ అయ్యేలా ఉంది.