విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన `డియర్ కామ్రేడ్` ప్రేక్షకుల ముందుకొచ్చి కొన్ని గంటలే గడుస్తోంది. సినిమా కు డివైడ్ టాక్ వచ్చింది. టాప్ వెబ్ సైట్ల రివ్యూలు పాజిటివ్ గా లేవు. హిట్టా..పట్టా అన్నది తేలడానికి రెండు రోజుల సమయం పడుతోంది. దీంతో యూనిట్ బూస్టింగ్ ఇచ్చే పనిలో పడింది. వీలైనంత తర్వగా పెట్టుబడి అయినా రివకరీ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఇంతలో డియర్ కామ్రేడ్ పై ఓ షాకింగ్ రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చర్చకొచ్చింది. డియర్ కామ్రేడ్ పై పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ స్ర్తీ కాస్టింగ్ కౌచ్ జరిగిదంటూ ఆరోపణ చేయడం విశేషం. ఆ సినిమాకు పనిచేసిన కొందరు మహిళలపై లైంగిక దాడులు జరిగాయని ఆరోపించింది.
అవకాశాలు అందుకున్న వారంతా కమిట్ బ్యాచ్ అని సెటైర్ వేసే ప్రయత్నం చేసింది. అందులో పెద్ద పెద్ద తలకాయలే కీలక పాత్ర పోషించాయని హింట్ ఇచ్చింది. పరిశ్రమలో అందరి లోగుట్టు తెలిసిన మహిళ ఈ విషయం లీక్ చేయడంతో సంచలనమవుతోంది. అయితే బాధితులు ఎవరు? అన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడే ఎందుకు ఓపెన్ అయినట్లు? సినిమా రిలీజ్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటి? ఇందులో నిజమెంత? అన్నది తెలియడం అన్నది అంత ఈజీ కాదు.
ఇటీవల కాలంలో ప్రచారం కోసం ఇలాంటి స్టంట్లు చేసే వాళ్లు ఎక్కువగానే ఉన్నారు. నిజంగా లైంగిక దాడులు జరిగినా నమ్మే పరిస్థితుల్లో లేరు. అంతగా ప్రచారం స్టంట్ వాటిపై ప్రభావం చూపుతోంది. కాస్టింగ్ కౌచ్ పేరు చెప్పుకుని టాలీవుడ్ లో పాపులర్ అయిన వాళ్లు తక్కువేం కాదు. పేరు కోసం ఎంతకైనా తెగబడుతున్నారు అన్నదానికి శ్రీరెడ్డే పెద్ద ఉదాహారణ. అర్ధనగ్నంగా ఛాంబర్ ముందు భైటాయించినప్పుడే టాలీవుడ్ పరువు గంగలో కలిసిపోయింది. దేశ సినిమా చరిత్రలోనే ఇది మర్చిపోలేని ఘట్టం. టాలీవుడ్ చరిత్రలో అదోక బ్లాక్ డే. ప్రస్తుతం బిగ్ బాస్ -3 కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే.