మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ ముగిసింది. అవినీష్ రెడ్డి ని సుమారు 5 గంటల పాటు అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. అయితే సిబిఐ తలన అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టును కోరగా.. అందుకు ధర్మాసనం అంగీకరించింది. సోమవారం వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సిబిఐకి సూచించింది ధర్మాసనం.
అయితే విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో కీలక విజయాలను పక్కనపెట్టి సిల్లీ విషయాలపై విచారణ చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. కేవలం సిబిఐ కుట్రలకు ఉపయోగపడే వారి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని, పర్సన్ టార్గెట్ గా దర్యాప్తు చేపడుతున్నారని మండిపడ్డారు. సిబిఐ తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఎంత దూరమైనా న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు అవినాష్ రెడ్డి.