నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రధారిని అదుపులోకి తీసుకున్న సీబీఐ

-

నీట్ పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కుల కేటాయింపు దేశంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును కేంద్రము సీబీఐకి అప్పగించింది.రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసులో కీలక సూత్రధారిని ఇవాళ అరెస్టు చేసింది. బిహార్‌లోని నలందకు చెందిన రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ను పాట్నా నగర శివార్లలో అదుపులోకి తీసుకుంది.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న సంజీవ్ ముఖియా బంధువు ఈ రాకేష్ రంజన్‌ అని సిబిఐ గుర్తించారు. అరెస్టు చేసిన వెంటనే అతడిని పాట్నాలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చగా, 10 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వారం ప్రారంభంలో జార్ఖండ్‌,బిహార్, బెంగాల్‌లోని పలుచోట్ల సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో పలు కీలక సాక్ష్యాలను సేకరించింది. వాటి ఆధారంగానే రాకీని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ 6 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. బిహార్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పేపర్ లీక్‌లకు సంబంధించినది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు అభ్యర్థులను మోసగించడంతో ముడిపడి ఉన్నవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version