ఆన్ లైన్ లో చిన్నపిల్లల ఫోన్ వీడియో లకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా సి.బి.ఐ ఒక్కసారిగా దాడులు నిర్వహించింది. ఇటీవల 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసిన సీబీఐ అధికారులు… తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో… చిన్నారుల పోర్న్ వీడియో లకు సంబంధించి సోదాలు నిర్వహించింది.
14 రాష్ట్రాల్లోని… ఏకంగా 76 ప్రాంతా ల్లో సిబిఐ దాడులు చేస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులను చేస్తోంది సిబిఐ. ఆంధ్ర ప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ మరియు హిమా చల్ ప్రదేశ్ లలో సిబిఐ సోదాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా 76 ప్రాంతాల్లో, 14 రాష్ట్రా ల్లో సోదాలు చేస్తున్న సీబీఐ అధికారులు.. ఇప్పటికే 23 కేసులు నమోదు చేశారు. చిన్నపిల్లలను వాడుకుని కొంతమంది దుర్మార్గులు పోర్న్ వీడియోలు చేస్తున్నారని… తమకు స్పష్టమైన సమాచారం వచ్చిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. పక్కా సమాచారం మేరకే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా 76 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు స్పష్టం చేశారు.