సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలు రద్దు..ఇంటర్ పరీక్షలు వాయిదా

-

సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలు రద్దయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ తో పరీక్షలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. పరీక్షల పై విద్యా శాఖ అధికారులతో ఉన్నాతస్థాయి సమీక్ష జరిపిన ప్రధాని ఈ కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలపై జూన్‌లో మరోసారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ నేత‌లు రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌తోపాటు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ప‌రీక్షల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. జూన్ 1న బోర్డు అప్పటి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ను త‌ర్వాత నిర్వహించాల‌ని నిర్ణయించారు. 12 త‌ర‌గ‌తి ప‌రీక్షలు మే 4 నుంచి జూన్ 14 వ‌ర‌కూ జ‌ర‌గాల్సి ఉండ‌గా వాయిదా ప‌డ్డాయి. పరీక్షల ప్రారంభానికి 15 రోజుల ముందే మళ్లీ వివరాలు ప్రకటిస్తాం అన్నారు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్.

విద్యార్థులు కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడంతో ఈసారి కూడా అదేవిధంగా అమలు చేసే అవకాశం ఉంది. ఇక ఒకటో తరగతి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version