Breaking News : అమెజాన్‌కు జరిమానా..ఎందుకంటే..?

-

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు కు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) జరిమానా విధించింది. ఏమాత్రం నాణ్యత లేని ప్రెషర్‌ కుక్కర్లను విక్రయించినందుకు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ పై సీసీపీఏ తీవ్రంగా మండిపడింది. సదరు ప్రెషర్‌ కుక్కర్లు అన్నింటినీ వెంటనే వినియోగదారుల నుంచి వెనక్కి తీసుకుని.. డబ్బులను తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది సీసీపీఏ. అంతేగాకుండా ఈ వ్యవహారంలో నిర్లక్ష్యానికి సంబంధించి లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించింది సీసీపీఏ. అమెజాన్‌ లో ఆర్డర్‌ చేసిన ఓ ప్రెషర్‌ కుక్కర్‌ నాణ్యతకు సంబంధించి ఒక కొనుగోలుదారు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన వినియోగదారుల ఫోరం ప్రెషర్‌ కుక్కర్‌ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమెజాన్‌ ను కోరింది సీసీపీఏ. ఆ వివరాలు అందాక పరిశీలన జరిపిన అధికారులు.. అవి నాణ్యతా ప్రమాణాల మేరకు లేవని గుర్తించారు. అమెజాన్‌ ను పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించారు.

మెల్లగా ఈ అంశం కేంద్ర వినియోగదారుల ఫోరానికి చేరింది సీసీపీఏ. ఆధారాలను పరిశీలించి, వాదనలు విన్న కేంద్ర ఫోరం.. తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ తరహా ప్రెషర్‌ కుక్కర్లను 2,265 మంది వినియోగదారులకు అమ్మినట్టు గుర్తించిన వినియోగదారుల ఫోరం.. వారందరికీ ఈ విషయంపై సమాచారం ఇవ్వాలని అమెజాన్‌ ను ఆదేశించింది. సదరు వినియోగదారుల నుంచి నాసిరకం కుక్కర్లను వెనక్కి తీసుకుని, డబ్బులను రిఫండ్‌ చేయాలని సూచించింది సీసీపీఏ. నాణ్యతా ప్రమాణాలను, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానాగా కట్టాలని అమెజాన్‌ ను ఆదేశించింది. కాగా 2,265 ప్రెషర్‌ కుక్కర్లను తమ ప్లాట్‌ ఫాంపై విక్రయించడం ద్వారా అమెజాన్‌ రూ.6,14,825 మేర కమీషన్‌ పొందడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version