కేంద్ర ఆర్థిక విధానాల‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

-

మరోసారి కేంద్ర ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన.. మోదీ అస్త‌వ్య‌స్త, అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల‌నే దేశ ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. త‌మ త‌ప్పుడు ఆర్థిక విధానాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కేంద్రం అనేక అబ‌ద్ధాలు చెప్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు మంత్రి కేటీఆర్‌. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం చరిత్రలో నిలుస్తుంద‌న్నారు కేటీఆర్. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడడం, 30 సంవత్సరాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బ‌ణం, 45 సంవత్సరాల అత్యధిక నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా తక్కువ స్ధాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం వంటి అనేక దుష్పరిణామాలే ఇందుకు ఉదాహరణలు అని తెలిపారు మంత్రి కేటీఆర్‌.

విద్యార్థులు ఉప‌యోగించే పెన్సిల్స్‌ నుంచి మొదలుకొని హాస్పిటల్ బెడ్లు, అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోదీది అని మండిప‌డ్డారు మంత్రి కేటీఆర్‌. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, రానున్న సవాళ్లను అంచనా వేయలేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే మోదీ ప్రభుత్వ అసలైన ఆర్థిక విధానాలని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం విభజించు పాలించు విధానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి కేటీఆర్‌. మోదీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టిన వారిపై క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ, కేంద్ర సంస్థ‌ల‌తో క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌న్నారు మంత్రి కేటీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version