బ్రేకింగ్ : భారత్ లో కోవాగ్జిన్ కు అత్యవసర అనుమతి

-

కోవాగ్జిన్‌ను అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. నిన్న కోవిషీల్డ్‌ను సిఫారస్సు చేసిన నిపుణుల కమిటీ ఈరోజు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి ఇచ్చింది. ఇక అత్యవసర వినియోగానికి ప్రత్యేక నిపుణుల బృందం సిఫారసు చేయడంతో ఈరోజు దానికి అనుమతి లభించింది. నిన్న కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో సిఫారసు చేసింది. దీంతో ఇప్పటి దాకా భారత్‌లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు సీడీఎస్‌సీవో సిఫారసు చేసినట్టు అయింది.

అలానే దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సీన్ గా కోవాగ్జిన్ నిలవనుంది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్ వ్యాక్స్‌న్‌ను తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ మన హైదరాబాద్ లోనే ఉండడం మరో గర్వ కారణం. ఇక కొవిషీల్డ్ విషయానికి వస్తే దానిని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా తయారు చేయగా సీరం ఇనిస్టిట్యూట్ దానిని ఉత్పత్తి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version