కేంద్ర హోంశాఖ, సీఈసీ తెలంగాణ ఈసీ రజత్ కుమార్ మాటను ఖాతరు చేయడం లేదంటూ సమాచారం. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఏపీ పోలీసులు తెలంగాణకు వద్దంటూ ఈసీ రజత్ కుమార్ గతంలోనే కేంద్రానికి స్పష్టం చేసినప్పటికీ… తెలంగాణలో డిసెంబరు 7న జరిగే ఎన్నికలకు ఏపీ నుంచి పోలీసు బలగాలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీఈసీ ఏపీని కోరడంతో సర్వత్ర చర్చనీయాంశమైంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితంచేసే అవకాశమున్నందున ఏపీ పోలీసులు, హోంగార్డులను తీసుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ 5 రోజుల క్రితం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా నుంచి 70 వేల మంది బలగాలను రప్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. మరి ఏపీ పోలీసుల రాకతో తెలంగాణలో ఎన్నికల సరళి ఏవిధంగా జరుగుతుందో అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకొనసాగుతోంది.