Dhada Saheb Phalke Awards 2023 : రెడ్​ కార్పెట్​పై అందాల భామల సోయగాలు

-

రెడ్​ కార్పెట్ అనగానే మనకు గుర్తొచ్చేది కలర్​ఫుల్ ఔట్​ఫిట్స్​లో హంసనడకలతో నడిచొచ్చే హీరోయిన్లు.. డ్యాషింగ్ డ్రెస్సులో వచ్చే స్టైలిష్ హీరోలు. తాజాగా ముంబయి వేదికగా జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుకలో రెడ్ కార్పెట్​పై కూడా ఈ డ్యాషింగ్ హీరోస్.. బ్యూటీఫుల్ హీరోయిన్లు సందడి చేశారు.

కలర్​ఫుల్ ఔట్​ఫిట్స్​లో.. కాన్ఫిడెంట్ వాక్​లో రెడ్ కార్పెట్​పై తారలు దిగివచ్చారు. ముంబయిలో సోమవారం రాత్రి.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌ సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారలందరూ అదిరిపోయే స్టైలిష్‌ డ్రెస్సుల్లో మెరిసిపోయారు.

రేఖ, ఆలియా భట్​, విద్యాబాలన్​, అనుపమ్ ఖేర్​, మనీశ్​ పాల్​, ఆర్​ బల్కి, వరుణ్‌ ధావన్‌, రోనిత్‌ రాయ్‌, శ్రేయా తల్పాడే, ఆర్‌.బాల్కి, షాహిల్‌ ఖాన్‌, నటాలియా, జయంతిలాల్‌ గడ, సాచిత్‌, పరంపర, వివేక్‌ అగ్నిహోత్రి, రిషబ్‌ శెట్టి, హరిహరన్‌ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version