IRCTC: హైదరాబాద్ నుండి కేరళ… ప్యాకేజీ రూ.12,000 లోపే..!

-

చాలా మంది కేరళ వెళ్లాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా కేరళ అందాలని చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారా..? అయినా వెళ్లడం కుదరడం లేదా..? అయితే ఈ ప్యాకేజీ ని చూసేయండి. కేరళ టూర్ వెళ్లాలనుకునే హైదరాబాదీలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి కేరళకు ఓ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరు తో ఈ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మున్నార్, అలెప్పీ లోని పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. రైలులో తీసుకెళ్లి ఈ ప్రదేశాలని చూపించనుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది. రూ.12,000 లోపే వెళ్లి రావాలంటే గ్రూప్ బుకింగ్ చెయ్యండి.

మొదటి రోజు హైదరాబాద్‌లో ఇది మొదలు అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి.
రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకుళం రీచ్ అవుతారు.
అక్కడ నుండి మున్నార్ వెళ్ళాలి. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి.
మూడో రోజు ఎరవికుళం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్ చూడచ్చు. రాత్రికి మున్నార్‌లో స్టే చేయాలి.
నాలుగో రోజు అలెప్పీ వెళ్ళాలి. బ్యాక్‌వాటర్స్ ని కూడా చూసేయచ్చు. రాత్రికి అలెప్పీలో ఉండాలి.
ఐదో రోజు ఎర్నాకుళం స్టార్ట్ అవ్వాలి. ఎర్నాకుళంలో ఉదయం 11.20 గంటలకు రైలు ఎక్కితే ఆరో రోజు సికింద్రాబాద్ రీచ్ అవుతారు అంతే.
పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.
ధర విషయానికి వస్తే.. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.11,610, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.13,770 గా ఉంది.
కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.14,320, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.16,480 చెల్లించాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version