తమ వ్యక్తిగత జీవితాన్ని జనాల మధ్య పెట్టి అందరిచే బ్యాడ్ అనిపించుకోవడం ఎందుకని, షోలో పాల్గొనడం వల్ల వచ్చే ఐదారు లక్షల కోసం వెంపర్లాడడం ఎందుకులే.. ఎందుకొచ్చిన తంటా అని చెప్పి ఇప్పుడు నటులు బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపించడం లేదట.
సాధారణంగా బిగ్ బాస్ షో అంటే.. అందులో పాల్గొంటే.. చివరి వరకు ఉండి విన్నర్ అయితే.. మంచి పేరు, ఆఫర్లతో డబ్బు సంపాదించవచ్చని అందరూ భావిస్తుంటారు. అందుకనే తెలుగులో ఈ షో ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఈ సారి షోలో పాల్గొనేందుకు కంటెస్టెంట్లు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో స్టార్ మా యాజమాన్యానికి ఏం చేయాలో తోచడం లేదట..!
గతంలో బిగ్‌బాస్ షో చేసిన వారికి ఎంతటి పేరు, క్రేజ్ వచ్చిందో తెలిసిందే. అయితే అది కేవలం షో నడిచినంత కాలం మాత్రమే ఉండేది. కానీ షో ముగిశాక విన్నర్లు కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా మరుగున పడిపోయారు. నిజానికి షో వల్ల కంటెస్టెంట్లకు వచ్చే మంచి పేరు మాట దేవుడెరుగు. వారికి పూర్తిగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. గతంలో శివబాలాజీ, ఆ తరువాత కౌశల్‌లు బిగ్‌బాస్ విన్నర్లుగా నిలిచినప్పటికీ ఆ తరువాత వారికి నెగెటివ్ పబ్లిసిటీ ఎక్కువ అయింది. దీంతో వారికి సినిమాల్లోనూ అవకాశాలు తగ్గాయి.
మరికొంత మంది అయితే బిగ్‌బాస్ షోలో తమ పేరు వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. హీరో తరుణ్, శ్రద్ధా దాస్‌లు తాము బిగ్‌బాస్‌లో పాల్గోవట్లేదంటూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. శ్రద్ధా ఒక అడుగు ముందుకేసి కేసులు పెడతా జాగ్రత్తా అంటూ హెచ్చరించింది కూడా. ( ఇది కూడా చదవండి – బిగ్‌బాస్ 4 శ్రద్దా దాస్ హెచ్చరిక.. కేసువేస్తా జాగ్రత్త.. )
ఇలా బిగ్‌బాస్ షోలో పాల్గొన్న దాదాపు చాలామందిపై ఇప్పుడు నెగెటివ్ ఇంప్రెషనే పడింది. దీంతో ఇక ఆషోలో పాల్గొనాలంటేనే చాలా మంది నటులు, ఇతర సెలబ్రిటీలు జంకుతున్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని జనాల మధ్య పెట్టి అందరిచే బ్యాడ్ అనిపించుకోవడం ఎందుకని, షోలో పాల్గొనడం వల్ల వచ్చే ఐదారు లక్షల కోసం వెంపర్లాడడం ఎందుకులే.. ఎందుకొచ్చిన తంటా అని చెప్పి ఇప్పుడు నటులు బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపించడం లేదట. బిగ్ బాస్.. అంటే.. మాకొద్దు బాబోయ్.. అన్న పరిస్థితి ప్రస్తుతం ఉందట.. దీంతో ఈ సారి బిగ్ బాస్ షోకు ఇంకా కంటెస్టెంట్ల లిస్టు ఫైనల్ కాలేదని తెలిసింది.
అయితే షోలో ఎవరు పాల్గొన్నా అందరికీ అనుకూలంగా ఉండేలా గేమ్ ఉంటుందని నిర్వాహకులు కంటెస్టెంట్లను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. మరి షోలో ఎవరెవరు పాల్గొంటారో.. ఈసారి ఈ షో గతంలో లాగే రసవత్తరంగా సాగుతుందో, లేక నిర్వాహకులు చెప్పినట్లుగా కంటెస్టెంట్లకు అనుకూలంగా ఉంటుందో.. మరికొద్ది రోజుల పాటు వేచి చూస్తే తెలుస్తుంది..!