ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైఋతి బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంది అని వాతావరణ నిపుణులు తెలిపారు.రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.