బిగ్బాస్ 4లో శ్రద్ధాదాస్ అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ శ్రద్ధాదాస్ స్పందించింది. బిగ్బాస్లో తాను పాల్గొంటున్ననాంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదని, తనను బిగ్బాస్ నిర్వాహకులు ఎవ్వరూ సంప్రదించలేదని తెలిపింది. తాను గతంలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు ఆగటం లేదని ఇప్పటికైనా పులిస్టాప్ పెట్టాలని ట్వీట్ చేసింది. ఇప్పటికే చాలాసార్లు చెప్పినా ఇంకా తను బిగ్బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు వార్తలు రాస్తున్నారని, జర్నలిస్టులు ఇలాంటి వార్తలు రాసేముందు క్లారిటీ తీసుకుంటే బావుంటుందని తెలిపింది.
ఇలా తప్పుడు వార్తలను రాయడం ఆపాలని, అలాంటివారికి ఇదే నా మొదటి, చివరి హెచ్చరిక. అసత్యపు వార్తలు రాసే వాళ్లు ఇలాగే చేస్తే వారిపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోడానికి కూడా వెనుకాడబోనని చెప్పింది.
I hav Not been approached for Big boss Telugu & i am not a part of it.
Once again, inundated with msgs from a lot of ppl askin me about it & putting my name up as if it is confirmed already.Will have to take legal action on the sources otherwise!Making it clear 1 last time pls🙏— Shraddha das (@shraddhadas43) July 26, 2020
సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అవుతాయా ఏంటీ.. గాసిప్ రాయుళ్ళు ఇకనైనా ఆపేస్తేనే బెటర్.