చార్‌ ధామ్ యాత్రలో విషాదం.. 17 మంది మృతి

-

చార్ ధామ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి బస్సులో వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీతో మాట్లాడానని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version