క‌రోనా ల‌క్ష‌ణాలు లేవా.. అయితే మ‌రింత ప్ర‌మాద‌మే..!

-

క‌రోనా వైర‌స్ ప‌రిశోధ‌కుల అంచ‌నాల‌కు చిక్క‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ మ‌హ‌మ్మారికి సంబంధించిన రోజుకో కొత్త‌విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. కొవిడ్ ల‌క్ష‌ణాలు లేకున్నా.. వైర‌స్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య‌నే ఎక్కువ‌గా ఉంది. దీనిపై హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్ చేసిన స‌ర్వేలో ఆందోళ‌న క‌లిగించే విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. క‌రోనా‌ లక్షణాలు ఉన్నవారి కంటే…ఏ లక్షణాలు లేని అసింప్టమేటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ లోడు ఎక్కువగా ఉన్నట్లు ఈ స‌ర్వేలో స్పష్టమైంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. 95 శాతం మందిలో 20 బి క్లేడ్‌ స్ట్రెయిట్‌ రకం వైరస్ కూడా ఉన్న‌ట్లు వారి ప‌రిశోధ‌న‌లో తేలింది. గ‌త మే, జూన్‌ మాసాల్లో గ్రేటర్ హైద‌రాబాద్‌ సహా…శివారు ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్‌ బారిన పడిన 210 మంది డేటాను సేకరించి, విశ్లేషించగా ఈ విషయం స్పష్టమైంది. అయితే.. వైరస్‌లోడుకు తోడు…అదేస్థాయిలో ఇమ్యునిటీ లెవ ల్స్‌ ఉండటం వల్లే వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరి నుంచి ఇమ్యునిటీ లెవల్స్‌ తక్కువగా ఉన్న వారికి వైరస్‌ వ్యాపించి, వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు గుర్తించింది.

ఇప్ప‌టివ‌ర‌కు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 57 వేల మంది కొవిడ్ బారిన పడ్డారు. వీరిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కేవలం 30 శాతం మందిలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు క‌నిపించాయి. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే…ఏ లక్షణాలు లేని అసింప్టమాటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ లోడు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి నుంచి వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్‌ విస్తరించి, పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు ఈ ప‌రిశోధ‌న‌లో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version