కేంద్ర బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ పద్దులను చదివి వినిపిస్తున్నారు. ఇదిలాఉండగా కేంద్రం గిగ్ వర్కర్లకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న (స్విగ్వీ, జొమాటో) వలే డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు కోటి మంది వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది.
అందుకోసం గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా గుర్తింపు కార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను అమలు చేయనున్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా గిగ్ వర్కర్ల పేర్లను నమోదు చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రహదారులపై సంచరించే వారికి బీమా సౌకర్యం ఎంతగానో ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు.