Nirmala Sitharaman: వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.30 వేలతో స్ట్రీట్ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు.. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్.
అయితే… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతన్న సమయంలో కుంభమేళా ఘటనపై ఆందోళన చేపట్టిన విపక్షాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్‌తో సహా ప్రధాన విపక్ష పార్టీలు చర్చకు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా నిరాకరించడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టి.. కాసేపటి తర్వాత వాకౌట్ చేశాయి.