అమరావతి : బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షుగర్ ఫ్యాక్టరీలు మూత.. చెరుకు రైతుల జీవితాల్లో చేదు అని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. పూజ్య బాపూజీ కలలు కన్న సహకార వ్యవస్ధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార వ్యవస్థ తోనే దేశాభివృద్ది జరుగుతుంది అటువంటి వ్యవస్థను మంట కలుపుతున్నారని మండిపడ్డారు ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న మన రాష్ట్రంలో చెరుకు రైతును ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నాయన్నారు. సహకార చెక్కర కర్మాగారాల పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం రూ. 910 కోట్లు ఆర్థిక సహకారం అందిస్తోందని ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాయిలా పడిన పంచదార మిల్లులకు రూ. 100 నుంచి రూ. 200 కోట్లు కేటాయిస్తే షుగర్ ఫ్యాక్టరీ ల నిర్వహణ ,చెరకు రైతుల బాకీలు తీరతాయన్నారు ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.