అన్ని బోర్డు పరిక్షలు వాయిదా, రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన కేంద్రం…!

-

భారతదేశంలో రోజూ రోజుకి కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య వేగంగా పెరుగుతోంది, ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు 170 కి పెరిగాయి మరియు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు బోర్డు పరీక్షలు నిలిపివేశారు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో సెక్షన్ 144 విధించారు. కరోనా వైరస్ దెబ్బకు ఇటలీలో 475 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది పక్కన పెడితే ఇప్పటికే కరోనావైరస్ వ్యాప్తి నేపధ్యంలో అన్ని పాఠశాల, విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 13 కి పెరిగింది. దీనితో తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తమైంది.

తెలంగాణా మూడో స్థానంలో ఉంది పాజిటివ్ కేసుల్లో. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ప్రజలను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1 నుంచి 8 వ తరగతి వరకు పరీక్షలను నిర్వహించకుండా పాస్ అయినట్టు ప్రకటించారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఆ విధంగా అడుగు వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version