కొవిన్ పోర్టల్ డేటా లీక్‌.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

-

కొవిన్ పోర్టల్ డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టి పారేసింది. డేటా ఉల్లంఘనకు సంబంధించిన వార్తలన్నీ నిరాధారమని పేర్కొంది. కొవిన్ పోర్టల్ డేటా లీక్ అంటూ విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కొవిన్ పోర్టల్ డేటా పూర్తిగా సేఫ్ గా ఉందని తెలిపాయి. కొవిన్ పోర్టల్ , అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలను సేకరించదని తెలిపాయి. కొవిన్ ద్వారా ఎన్ని డోసులు తీసుకున్నామనే సమాచారం మాత్రమే తెలుస్తుందని వెల్లడించాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.దేశంలో కీలక సమాచారం లీక్ కలకలం రేపింది.

 

కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కొవిన్ పోర్టల్ లోని సెన్సిటివ్ డేటా టెలిగ్రామ్ లో ప్రత్యక్షమైంది. వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్ వంటి వివరాలు టెలిగ్రామ్ లో దర్శనమిచ్చాయని టీఎంసీ నేత సాకేత్ ట్వీట్ చేశారు. డేటా లీకైన వారిలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, చిదంబరం, ఎపీ డెరెక్ ఓబ్రెయిన్ ల వివరాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.కోవిన్ యాప్‌లో విదేశాలకు వెళ్లి వారి ట్రావెల్ హిస్టరీని అప్‌డేట్ చేసిన వ్యక్తుల పాస్‌పోర్ట్ నంబర్లు లీకైన డేటాలో ఉన్నాయి” అని దక్షిణాసియా ఇండెక్స్ ట్వీట్ చేసింది, కోవిన్ డేటా లీక్ అయిన తర్వాత భద్రతా చర్యల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులను అప్రమత్తం చేసే అవకాశం ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version