జనసేనలో చేరిన టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత

-

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత ఒకరు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడటంతో పవన్.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాడు.

మరో రెండు రోజుల్లో ఆయన వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేన తరుపున ప్రచారానికి సర్వం సిద్ధం చేస్తున్నారు జనసైనికులు. ఇక మరోపక్క కొత్తవారు జనసేన పార్టీ కండువా కప్పుకొని పవన్ కు తమ మద్దత్తును తెలుపుతున్నారు. తాజాగా జనసేనలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్. భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్.. 2003లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇక పవన్ తో అత్తారింటికి దారేది, రామ్ చరణ్ తో మగధీర లాంటి హిట్ సినిమాలను నిర్మించాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version