ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బలగాలను దింపాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో 18 రెట్లు పెరిగాయి కరోనా కేసులు. తాజాగా మరో 16 కేసులు నమోదు కావడం తో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టకపోతే మాత్రం పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ కేసులు భారీగా మరో రెండు రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో కొత్త భయం మొదలయింది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి బలగాలను పంపడమే కాకుండా ప్రత్యేక వైద్య బృందాలను దించాలి అని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా తయారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వెంటనే కేంద్రం వైద్యులను వైద్య పరికరాలను రాష్ట్రానికి పంపాలని కోరుతున్నారు. ఇక ఆర్ధికంగా కూడా రాష్ట్రానికి అండగా నిలబడకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.