ఇప్పటికీ దార్లోకి వచ్చారు .. సరైన దాని మీద ఖర్చు పెడుతున్నారు !

-

చాలా దేశాలు తమ బడ్జెట్ లో ఎక్కువగా బోర్డర్ లో ఉండే సైనికులకు ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ కేటాయింపులు చేయటం మనకందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వచ్చాక అసలైన సైనికులు సరిహద్దుల్లో ఉన్నవారు మాత్రమే కాదు వైద్యులు కూడా సైనికులే అని తేలింది. ప్రస్తుతం కరోనా వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్నది ఎవరయ్యా అంటే డాక్టర్స్ మరియు నర్స్ లు మరియు వైద్య సిబ్బంది అని చెప్పవచ్చు. అటువంటి వైద్య సిబ్బందికి కనీసం మనదేశ బడ్జెట్ లో మినిమం కేటాయింపులు కూడా జరగకపోవడంతో అనేక అవస్థలు, ఇబ్బందులు ప్రస్తుతం కరోనా వైరస్ తో చేస్తున్న యుద్ధంలో ఎదుర్కొంటున్నారు. దీంతో కరోనా వైరస్ పుణ్యమా అని రాబోయే బడ్జెట్ సమావేశాలలో వైద్య రంగానికి కూడా పెద్దపీట వేస్తూ భారీగా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది.ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశంలో ఉన్న ప్రజలకు రేషన్ మరియు నిత్యవసర సరుకుల వంటి విషయాలపై మాత్రమే కేంద్రం దృష్టి పెట్టింది. కాగా ఉన్నా కొద్దీ పాజిటివ్ కేసులు… నమోదవుతున్న తరుణంలో దేశంలో ప్రజలందరికీ మాస్కులు అందించడానికి కేంద్రం రెడీ అవుతోందట. ఈ తరుణంలో ఇటీవల కరోనా వైరస్ చికిత్స చేస్తున్న వైద్యులు నర్సులకు కూడా కరోనా వైరస్ సోకటం తో ముందుగా దేశవ్యాప్తంగా… కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి మాస్కులు ఇవ్వటానికి తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ఇందుకోసం ఏకంగా 500 కోట్లకు పైగానే కేంద్రం ఖర్చు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలామంది వైద్యులు.. వైద్యం అందిస్తూ కరోనా బారిన పడటంతో… వాళ్లకు తెలియకుండా ఇతరులకు కూడా సోకుతున్న తరుణంలో.. కేంద్రం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మొన్నటివరకు బియ్యం, నిత్యావసర సరుకుల కోసం అనవసర ఖర్చులు పెట్టారు. ఇప్పుడు వైద్య సిబ్బందికి రక్షణ కోసం మాస్కులు అందించడానికి సరైన దాని మీద ఖర్చు పెట్టబోతున్నారు, ఇప్పటికీ దార్లోకి వచ్చారు అంటూ నెటిజన్లు కేంద్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లాక్ డౌన్ అంతా  పటిష్టంగా అమలు అవుతున్న… కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో కొన్ని పొరపాట్లు జరిగి వైరస్ ఇతరులకు వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవటం గ్రేట్ అని అంటున్నారు. మరికొంతమంది ముందే ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేదని సూచనలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version