తెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేసీఆర్… నేడు కేబినేట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపు, వలస కార్మికుల కష్టాలు, ధాన్యం కొనుగోలు, కరోనా కట్టడి, వైద్య సదుపాయాలు,
మరిన్ని విషయాలను చర్చించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ని తెలంగాణా ఏప్రిల్ 30 వరకు ప్రకటించింది. కేంద్రం మే 3 వరకు అని చెప్పింది. మే 3 వరకు కొనసాగించాలా లేక ఏప్రిల్ 30 తో ముగించాలా అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీనితో హైదరాబాద్ లో లాక్ డౌన్ ని కొనసాగించాలీ అనే దాని మీద చర్చ జరపనున్నారు.
మెజారిటి అభిప్రాయం హైదరాబాద్ లో ఇప్పుడు లాక్ డౌన్ ని సడలిస్తే మరో ముంబై అవుతుంది అనే హెచ్చరికలు ఉన్నాయి. అందుకే మేధావులు, మాజీ మంత్రులు, రాజకీయ పరిశీలకులు ఇలా కొందరి తో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ మార్గదర్శకాలను అమలు చేయవద్దు అని కూడా కేసీఆర్ భావిస్తున్నారు.