రాష్ట్ర విడిపోయినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి.. అప్పటి నుండి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఎప్పటికప్పుడు ఇప్పుడు అయిపోతుంది, అప్పుడు అయిపోతుంది అంటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చినా పని మాత్రం అగమ్యగోచరంగా జరుగుతోంది. ఇది పత్రికలు, వార్తాఛానెళ్ళు, ప్రతిపక్షాలు మరియు రాజకీయ వర్గాలు మనసులో మెదులుతున్న ప్రశ్నలు. కానీ తాజాగా ఇప్పటి వరకు పోలవరం పూర్తి కాకపోవడానికి సరియన కారణం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ కేంద్రం పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖిత పూర్వకంగా తెలియచేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్నీ తెలియచేస్తూ. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ పోలవరాన్ని 2024 జూన్ కు పూర్తి చేయాల్సి ఉంది.
కానీ 2020 మరియు 2022 లో భారీ వరదలు రావడం వలన మరింతగా లేట్ అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇందుకోసం తొలిదశకు ఏపీ చెప్పిన ప్రకారం రూ. 17144 కోట్లు విడుదల చేస్తామని తెలిపింది.