రెండో బూస్టర్​ డోస్​ పై కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే..?

-

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో మాత్రం కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళ వారం ఉదయం వరకు 134 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు, రెండో బూస్టర్​ డోస్​ తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఓ సూచన చేసింది. ప్రస్తుతానికి అందరికి రెండో బూస్టర్​ డోస్ అవసరం లేదని, ముందుగా మొదటి బూస్టర్​ డోస్​ పూర్తైన తరువాత దాని గురించి ఆలోచిద్దామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version