దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో చాలా మంది మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎక్కువ మరణాలు సంభవించకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫోర్ వీలర్, ప్యాసింజర్ వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది.
దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాహనాల్లో డ్రైవర్ తో పాటు ప్యాసింజర్స్ కు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధన ఈ ఏడాది జనవరి 1 తేదీ నుంచి అమలు అవుతుంది. అయితే ఈ నిబంధనను కాస్త మార్చి.. వాహనాలకు తప్పకుండా కనీసం ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పని సరి చేసింది. ఈ నిబంధనతో రోడ్డు ప్రమాదాలు సంభవించినా.. మరణాల సంఖ్యను కాస్త తగ్గించ వచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.