కరోనా విలయం… అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కరోనా పెరుగుతున్న తరుణంలో కనీసం 48గంటల మెడికల్ ఆక్సీజన్ ను బఫరు స్టాక్ లో ఉంచుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు మెడికల్ ఆక్సిజన్ కంట్రోల్ రూములను సైతం మళ్ళీ పటిష్టం చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

రాష్ట్రాలు తమ వద్ద ఉన్న ఆక్సిజన్ సౌకర్యాలను అంచనా వేయాలని సూచించింది. ప్రైవేట్ సంస్థలో ను సామర్థ్యాన్ని అంచనా వేసి.. డిమాండ్ పెరిగిన సమయంలో సరఫరా పెంచేందుకు వ్యూహాన్ని రూపొందించాలని వెల్లడించింది. ఆస్పత్రిలలో ఎల్ ఎం ఎన్ ఓ బ్యాంకులో… రీఫిల్లింగ్ కు అంతరాయం లేకుండా సరఫరా చైన్ ఉండేలా చూడాలన్నారు. అలాగే అన్ని రాష్ట్రాలలో కరోనా నియమ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అన్నీ చోట్ల మాస్కులు కచ్చితం చేయాలని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version