ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…!

-

కేంద్రం ఏపీకి గుడ్ న్యూస్ అందించింది. సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన కృషికి ఇక ఫలితం దక్కినట్టే. నేషనల్ హైవేల అభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి దేశంలోనే అత్యధికంగా కేంద్రం నిధులు కేటాయించారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

2021–22 వార్షిక ప్రణాళిక కేటాయింపులను ఫైనల్ చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర హైవేలను ఈ నిధులతో డెవెలప్ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం 2021–22 వార్షిక ప్రణాళిక కింద ప్రతిపాదించిన దానికంటే కూడా ఎక్కువగా నిధులు రావడం జరిగింది.

609 కి.మీ.మేర రహదారుల అభివృద్ధికి రూ. 6,421 కోట్లు కేటాయించాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రహదారుల గురించి చెప్పగా సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించింది కేంద్రం.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నేషనల్ హైవేల అభివృద్ధికి అత్యధికంగా 2021–22 వార్షిక ప్రణాళికలో కేంద్రం నిధులను మంజూరు చేసారు. గత వార్షిక ప్రణాళికలో కేంద్రం మొదట రూ. 1,300 కోట్లే కేటాయించింది. హైవేలు అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో పారిశ్రామికాభిృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version