కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా బెనిఫిట్స్ ని పొందొచ్చు. అయితే మరి ఏయే స్కీమ్స్ వలన ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడే చూసేద్దాం.
పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్:
పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ని ప్రధాని మోదీ 25 అక్టోబర్ 2021 న మొదలు పెట్టారు. ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. జాతీయ స్థాయి పథకాలలో ఇది కూడా ఒకటి.
నిర్యత్ రిన్ వికాస్ యోజన
NIRVIK స్కీమ్ (నిర్యత్ రిన్ వికాస్ యోజన) అనేది ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) క్రింద లోన్స్ ని సులభతరం చేయడం మరియు చిన్న-స్థాయి ఎగుమతిదారులకు క్రెడిట్ లభ్యతను పెంపొందించే ఉద్దేశ్యంతో దీన్ని తీసుకొచ్చారు.
స్వామిత్వ పథకం:
24 ఏప్రిల్ 2021న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున ప్రధాన మంత్రి దీన్ని మొదలు పెట్టారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాండ్ పార్సెల్‌లను మ్యాపింగ్ చేయడం.. ఆస్తి కార్డులు లేదా దస్తావేజులు జారీ చేయడం… గృహ యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు.
సహాకర్ మిత్ర స్కీమ్:
12 జూన్ 2020న సహకార మిత్ర పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకు రావడం జరిగింది.
ధృవ్ స్కీమ్:
అక్టోబర్ 2019 లో దీన్ని స్టార్ట్ చేసారు. ప్రధాన్ మంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయంతో భారత ప్రభుత్వం తీసుకు వచ్చింది. ప్రతిభావంతులైన పిల్లల నైపుణ్యాలు జ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఈ స్కీమ్ ఉపయోగ పడుతుంది.