పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా..? పిల్లల కోసం ఏ ఇబ్బంది లేకుండా డబ్బులను ఇప్పటి నుండి దాచుకోవాలని చూస్తుంటే ఈ స్కీమ్స్ లో డబ్బులని పెట్టవచ్చు. భారత ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఇక మరి భారత ప్రభుత్వం అందిస్తున్న ఆ స్కీమ్స్ గురించి వాటి వివరాల గురించి చూద్దాం. ఈ స్కీముల్లో డబ్బులని పెడితే మంచిగా రాబడి వస్తుంది. రిస్క్ ఉండదు పైగా ఏ సమస్యలు లేకుండా ఉండచ్చు. ఇక స్కీముల గురించి వివరాలు చూసేద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వలన ఎంతో లాభం ఉంటుంది. ఈ స్కీములో ఏడాదికి రూ. 500 నుంచి రూ. 1.5లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు. సురక్షితమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఈ స్కీము తో పొందవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. అలానే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా మంచి స్కీమ్ ఏ. ఆడపిల్లల చదువు,పెళ్లి ఖర్చుల కోసం ఈ స్కీములో డబ్బులని పెట్టచ్చు. అధిక-వడ్డీ రేటును ఈ స్కీమ్ తో పొందొచ్చు. ఈ స్కీమ్ లో పదిహేను ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వడ్డీ అయితే 7.6శాతంగా ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కూడా మంచి స్కీమ్ ఏ.
దీనికి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా మంచి స్కీమ్ ఏ. మ్యూచువల్ ఫండ్స్ ఉండే బెస్ట్ పథకం ఇది. కిసాన్ వికాస్ పత్ర కూడా మంచి స్కీమ్ ఏ. 124 నెలల స్థిర పదవీకాలం తర్వాత పెట్టుబడి మొత్తాన్ని ఈ స్కీము రెట్టింపు చేస్తుంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా అధిక వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలను అందించే స్కీమ్. ఇది కూడా మంచి పథకమే.