వంట గదికి షాకింగ్ న్యూస్…!

-

అంతర్జాతీయంగా ఇంధన రేట్లు పెరిగిన నేపధ్యంలో బుధవారం సిలిండర్‌కు రూ .144.5 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థల నోటిఫికేషన్ ప్రకారం ఎల్‌పిజి ధరను గతంలో ఉన్న రూ .714 నుంచి 14.2 కిలోల సిలిండర్‌కు రూ .858.50 కు పెంచారు. 2014 జనవరి తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ పెరుగలేదు. అప్పుడు ఏకంగా 220 పెరిగి 1,241 రూపాయలకు చేరుకుంది.

ప్రతీ ఏటా సబ్సిడీ కింద 12 సిలెండర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దేశీయ వినియోగదారులకు ప్రభుత్వ రాయితీ చెల్లింపును సిలిండర్‌కు రూ .153.86 నుంచి రూ .291.48 కు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన్ మంత్రి ఉజ్జ్వాల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్‌కు రూ .174.86 నుంచి రూ .312.48 కు పెరిగింది. ఎల్‌పిజి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా చెల్లించే సబ్సిడీని లెక్కించిన తరువాత,

14.2 కిలోల సిలిండర్‌కు సాధారణ వినియోగదారులకు రూ. 567.02, పిఎంయువై వినియోగదారులకు రూ .546.02 ఖర్చవుతుంది. పిఎంయువై కింద పేద మహిళలకు ప్రభుత్వం 8 కోట్ల ఉచిత ఎల్పిజి కనెక్షన్లను ఇచ్చింది. సాధారణంగా, ఎల్‌పిజి రేట్లు ప్రతి నెల 1 వ తేదీన సవరించబడతాయి. అయితే ఢిల్లీ ఎన్నికలు అవ్వగానే కేంద్రం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version