ఇప్పుడు సినిమా షూటింగ్ లు లేక టాలీవుడ్ జనానికి మైండ్ పని చేయడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. సినిమా షూటింగ్ ల కోసం జనం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా నిర్మాతలు ఇప్పుడు చాలా వరకు నష్టపోయారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రాల్లో పరిస్థితులు చూస్తుంటే లాక్ డౌన్ ని పెంచే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. అందుకే ఇప్పుడు కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది.
సినిమా షూటింగ్ లను గ్రీన్ జోన్ లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం చేసుకునే అవకాశం కల్పించింది. అయితే షూటింగ్ గురించి పూర్తి సమాచారం రాష్ట్రాలకు ఇవ్వాలని సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాల షూటింగ్ విషయంలో తాము కొన్ని మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆ విధంగా మాత్రమే షూటింగ్ ని చెయ్యాలని చెప్పినట్టు సమాచారం. విదేశాల నుంచి నటులు వచ్చే అవకాశం లేదు.
ఇప్పుడు కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల నుంచి నటులు ఎవరిని కూడా అనుమతించవద్దు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ షూటింగ్ లు మాత్రం వద్దు అని చెప్పే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సినిమాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రాల ఆలోచనలను కూడా కేంద్రం సినిమా షూటింగ్ ల విషయంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముంబై లోనే బాలీవుడ్ అంతా ఉంటుంది కాబట్టి వారితో షూటింగ్ లు ఇతర భాషల వాళ్ళు పెట్టుకోవద్దు అని కేంద్రం చెప్పే అవకాశం ఉంది.