వైజాగ్ మీద మోడీ మినిట్ టూ మినిట్ ఏం చేసారంటే…!

-

విశాఖలో జరిగిన ఘోర గ్యాస్ ప్రమాదం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తీరు నిజంగా ఇప్పుడు ప్రసంశలకు వేదికగా మారింది. ఘటన జరిగిన తర్వాత ట్విట్టర్ లో ఆయన ఒక ట్వీట్ చేసి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. అంతే కాకుండా అక్కడి నుంచి వెంటనే ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఉన్నతాధికారులకు ఫోన్ లు చేయడమే కాదు ఏపీ సర్కార్ కి కూడా ఫోన్ చేసారు.

కరోనా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ బాధితులను కాపాడాలి అని ఆయన రాష్ట్రానికి చెప్పారు. వెంటనే కేంద్ర విపత్తు నిర్వహణ శాఖను, హోం శాఖను అలెర్ట్ చేసి ఎపీకి పంపించారు. వారితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పూణే నుంచి పంపించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నేరుగా అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆక్సీజన్ కొరత ఉంది అని వార్తలు వచ్చాయి,

దీనిపై ఆయన వెంటనే రక్షణ శాఖతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని నేవీ నుంచి ఆక్సీజన్ ని విశాఖకు అందించాలి అని చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలతో మాట్లాడాలి అని కూడా అధికారులను ఆదేశించారు. అవసరం అయితే ఓడిస్సా సర్కార్ కూడా ముందుకు వచ్చి సహాయం చెయ్యాలని, బాధితుల సంఖ్య పెరిగితే వారిని ఓడిస్సా ఆస్పత్రుల్లో జాయిన్ చేసుకోవాలని ఆ రాష్ట్ర సిఎం కి కూడా ఆయన ఫోన్ చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version