కేంద్ర ప్రభుత్వం ఇంతకాలానికి కొన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భేటీ అయిన జీఎస్టీ మండలి 33 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 7 రకాల వస్తువులపై పన్నులను 28 నుంచి 18 శాతానికి.. మరో 26 వస్తువులపై 18 నుంచి 12 శాతం, 5 శాతానికి తగ్గించింది. దీంతో ఏసీలు, డిష్‌వాషర్స్, టీవీలు, డిజిటల్ కెమెరా, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు మరింత తగ్గనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ మోదీ ఉద్దేశించి … గాఢ నిద్ర నుంచి మోడీని లేపాము అంటూ వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో భాజపాకి వ్యతిరేక పవనాలు వీయడంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను మరోసారి మార్చుకుంటున్నట్లు సర్వత్రా చర్చనీయాంశ మైంది.
హమ్మయ్య.. 33 వస్తువులపై జీఎస్టీ తగ్గించిన కేంద్రం..
-