మహిళలపై దాడుల్లో బిహార్‌ను మించిపోయిన ఏపీ : కేంద్రం

-

ఉత్తర్ ప్రదేశ్, బిహార్ లను మించి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాయని తెలిపింది. 2018 నుంచి పోల్చితే 2021 నాటికి ఏపీలో అత్యాచారాలు 22శాతం, దాడులు 15శాతం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు 31శాతం పెరిగాయని పేర్కొంది.

ఈ మేరకు లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘2018 నుంచి 2021 మధ్య కాలంలో ఏపీలో మహిళలపై 4,340 అత్యాచారాలు, 8,406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు, 18,883 సాధారణ దాడులు జరిగాయి. మహిళలపై జరుగుతున్న దాడుల్లో యూపీ, బిహార్‌ను ఏపీ మించిపోయింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉంది’’ అని అజయ్ మిశ్రా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version