ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శాసనమండలిని రద్దు విషయంలో చాలా ఆశలే పెట్టుకున్నారు. పార్లమెంట్ లో అది కచ్చితంగా ఆమోదం పొందుతుంది అని భావించారు. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లుని శాసనమండలిలో అడ్డుకోవడంతో జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రానికి పంపి దాదాపు రెండు నెలలు కావస్తోం.ది కేంద్ర హోంశాఖ కూడా తమ బిల్లు అందిందని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఆ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తనకు అవసరమైన బిల్లులు మాత్రమే ఆమోదించుకు౦ది. ఈ పార్లమెంట్ సెషన్ లో ఆ బిల్లును ప్రవేశ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం షెడ్యూల్ లో కూడా లేదు. అత్యంత వేగంగా పార్లమెంట్ సమావేశాలు ముగించింది. వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల 3 వరకు జరగాల్సి ఉంది.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎంపీల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెల రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని ఆమోదించడానికి ప్రయత్నం చేసి ఉంటారని, కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఈ మేరకు ఆయన ఒప్పించు కుని ఉండవచ్చు అని అందరూ భావించారు. మరి ఏమైందో ఏమో తెలియదు గానీ కేంద్రం మాత్రం అసలు ఎంత వరకు పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు.