బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూన్ 30 వరకు ఆఫీసులోనే పని చేయాలని వర్కింగ్ డేస్ అన్నీ కూడా ఆఫీస్ లో నుండే పని చేయాలని కేంద్రం చెప్పింది. యూనియన్ గవర్నమెంట్ ఈ గైడ్ లైన్స్ ని తమ ఉద్యోగస్తులకు జారీ చేసింది.
సెంట్రల్ మినిస్ట్రీస్ మరియు డిపార్ట్మెంట్ కి ఈ గైడ్లైన్స్ వర్తిస్తాయి. గైడ్లైన్స్ ప్రకారం అండర్ సెక్రెటరీ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 50% ఆఫీస్ లో వర్క్ చేయాలి 50% ఇంట్లో వుంది వర్క్ చేయాలి.
మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు. అలానే రెండవ షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 వరకు. మూడవది మరియు నాలుగవది ఉదయం 10 గంటలకు మొదలయ్యి ఆరు గంటలకి ముగుస్తుంది.
ఇది ఇలా ఉంటే గర్భిణీలు వర్క్ ఫ్రం హోం చేయవచ్చు. అదే విధంగా కంటైన్మెంట్ జోన్ లో ఉండే ఉద్యోగస్తులు కూడా వర్క్ ఫ్రం హోం చేయవచ్చు. అయితే ఈ మహమ్మారిని సమయం లో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని, చేతులు శుభ్రంగా పదే పదే కడుక్కుంటూ ఉండడం, మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
అయితే 50 శాతం మంది ఆఫీస్ లో 50 శాతం మంది ఇంట్లో వర్క్ చేయడం వల్ల జనం తగ్గుతారు దీని వల్ల ఎక్కువ ఇబ్బందులు రావని ఈ నిర్ణయం తీసుకున్నారు. షిఫ్ట్స్ ని పెట్టడం వలన కూడా ఇబ్బందులు రావు.